Hyderabad: తల్లిదండ్రులతో మాట్లాడుతూనే... క్వార్టర్స్ పై నుంచి దూకేసిన బీటెక్ యువతి!

  • హైదరాబాద్ లో చదువుకుంటున్న యువతి
  • శనివారం నాడు ఇంటికి వచ్చి, ఆత్మహత్య
  • కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని మిలీనియం క్వార్టర్స్‌ లో నివాసం ఉండే ఓ సింగరేణి కార్మికుడి కుమార్తె, తన తల్లిదండ్రులతో మాట్లాడుతూనే క్వార్టర్స్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పిన్నింటి రోషిణీ రెడ్డి (24) అనే యువతి, హైదరాబాద్ లో బీటెక్‌ చదువుతోంది. ఆమె తండ్రి రవీందర్ రెడ్డి 6వ నంబర్ గనిలో ఓవర్ మెన్ కాగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు.

శనివారం ఉదయం ఇంటికి వచ్చిన ఆమె, రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడుతూనే, హఠాత్తుగా పై నుంచి కిందకు దూకింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె తల్లిదండ్రులతో గొడవ పడిందా? లేక ప్రేమ వ్యవహారం ఆమె ఆత్మహత్యకు కారణమా? అన్న కోణాల్లో దర్యాఫ్తు ప్రారంభించారు. తమ మధ్యే పెరిగి, తమ మధ్యే తిరిగిన రోషిణి మరణంతో క్వార్టర్స్ అంతటా విషాదఛాయలు అలముకున్నాయి.

Hyderabad
Jayashankar Bhupalpally District
Sucide
Lady
  • Loading...

More Telugu News