bhuma akhilapriya: నేను గెలిస్తే.. మీలో ఏ ఒక్కరినీ కూడా వదిలిపెట్టను: భూమా అఖిలప్రియ వార్నింగ్

  • నన్ను ఓడించేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి
  • నంద్యాలలో గెలవలేని వారు కూడా నన్ను ఓడించాలనుకుంటున్నారు
  • నన్ను ఓడించేందుకు బాగా కష్టపడండి

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ, రానున్న ఎన్నికల్లో తనను ఓడించేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని ఆమె మండిపడ్డారు. తనను ఓడించేందుకు బాగా కష్టపడాలని ప్రత్యర్థులకు సూచించారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే... ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నంద్యాలలో గెలవలేని నేతలు కూడా తనను ఓడించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా కుటుంబం విజయం సాధించి... ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని చెప్పారు. తనపై పోటీకి ఎవరిని నిలబెట్టాలో కూడా నిర్ణయించుకోలేని స్థితిలో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

bhuma akhilapriya
nandyal
allagadda
Telugudesam
warning
  • Loading...

More Telugu News