Rohit Sharma: తండ్రి అయిన రోహిత్ శర్మ.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రితికా
- ముంబైలోని ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రితికా
- భారత్ కు బయల్దేరిన రోహిత్
- నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశం
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యాడు. ఆయన భార్య రితికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని ఓ ఆసుప్రతిలో రితికా, రోహిత్ లకు ఆడబిడ్డ జన్మించిందని సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువైన సీమా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విషయాన్ని వెల్లడించింది. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ... ఈ సమయంలో తన భార్య పక్కన ఉండేందుకు భారత్ కు బయల్దేరాడు. ఈ నేపథ్యంలో, నాలుగో టెస్టుకు అతను దూరమయ్యే అవకాశం ఉంది.