srivishnu: 'బ్రోచేవారెవరురా' నుంచి వెరైటీ పోస్టర్

  • 'మెంటల్ మదిలో'తో మంచి పేరు 
  • క్రైమ్ కామెడీగా 'బ్రోచేవారెవరురా'
  • శ్రీవిష్ణు సరసన ఇద్దరు కథానాయికలు

'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన వివేక్ ఆత్రేయ, శ్రీ విష్ణు హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాకి 'బ్రోచేవారెవరురా' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. 'చలనమే చిత్రము .. చిత్రమే చలనము' అనేది ట్యాగ్ లైన్. తాజాగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.

న్యూ ఇయర్లో ఎవరికీ దిష్టి తగలకుండా అందరికీ శుభమే జరగాలని కోరుకుంటూ వెరైటీగా ఈ పోస్టర్ ను వదిలారు. క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది వివేక్ ఆత్రేయ చెబుతోన్న మాట. 

srivishnu
Niveda Thomas
niveda petu raj
  • Loading...

More Telugu News