Andhra Pradesh: మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు.. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటాం!: సుజనా చౌదరి

  • ఈ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా పాస్ చేసింది
  • దీన్ని ముందుగా సెలక్ట్ కమిటీకి పంపాలి
  • ఢిల్లీలో టీడీపీ నేతల మీడియా సమావేశం

వివాహ చట్టం ఏ మతం, కులానికి అయినా ఒకే రకంగా ఉండాలని టీడీపీ కోరుకుంటోందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. ముస్లిం భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెబితే దానికి జైలుశిక్ష విధించడం అన్యాయం చేయడమేన్నారు. లోక్ సభలో ఈ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా పాస్ చేసిందని ఆరోపించారు. రాజ్యసభలో మాత్రం దీన్ని అడ్డుకుంటామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి సుజనా చౌదరి మాట్లాడారు.

పార్లమెంటును ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావిస్తామనీ, కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో అది కనుమరుగయిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో టీడీపీ విప్ జారీచేసిందని తెలిపారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును అప్రజాస్వామిక విధానంలో లోక్ సభలో బీజేపీ పాస్ చేసిందని దుయ్యబట్టారు. ఈ బిల్లును పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News