Hyderabad: హైదరాబాద్ మెట్రో శుభవార్త.. నేడు అర్ధరాత్రి వరకు సేవలు

  • సేవలను పొడిగించిన మెట్రో
  • నాగోలు వైపు నుంచి చివరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు
  • అమీర్‌పేట నుంచి రాత్రి 12:30 గంటలకు

హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నేటి అర్ధ రాత్రి వరకు సేవలు కొనసాగనున్నట్టు తెలిపింది. వేడుకలు జరుపుకుని ఇంటికి వెళ్లే వారి కోసం సేవలను పొడిగించినట్టు పేర్కొంది. మియాపూర్, ఎల్బీనగర్, నాగోలు నుంచి నేటి అర్ధ రాత్రి 12 గంటల నుంచి చివరి రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్ నుంచి అన్ని వైపులకు రాత్రి 12:30 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.

Hyderabad
Metro Rail
New year
Celebrations
Ameerpet
Nagole
  • Loading...

More Telugu News