Chevella: భార్య వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని చూసి.. ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

  • భాగ్యమ్మకు రవితో పదేళ్ల క్రితం పెళ్లి
  • ఉమర్ అనే వ్యక్తితో ఉండటాన్ని చూసిన రవి
  • ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించి గడియ పెట్టాడు

భార్య వేరొకరితో కలిసి ఉండటాన్ని కళ్లారా చూసిన ఆ భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పట్టరాని కోపంతో అతను తీసుకున్న నిర్ణయం ఆ గ్రామంలో పెను సంచలనాన్ని రేపింది. చేవెళ్లలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దామరగిద్ద భాగ్యమ్మకు అదే గ్రామానికి చెందిన రవితో పదేళ్ల క్రితం పెళ్లైంది.

ఆదివారం ఉదయం భాగ్యమ్మ... ఉమర్ అనే వ్యక్తితో కలిసి ఉండటాన్ని చూసి భర్త రవి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఉమర్ వేసుకొచ్చిన బైక్‌లోని పెట్రోల్ తీసి వారిపై పోసి నిప్పంటించి ఇంటికి బయట గడియ పెట్టి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తీసి చూడగా భాగ్యమ్మ అప్పటికే సజీవ దహనం కాగా.. ఉమర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Chevella
Bhagyamma
Ravi
Umar
Petrol
  • Loading...

More Telugu News