Kala venkat Rao: కేసీఆర్ చెబుతున్న గుణాత్మక మార్పు.. ముందు ఆయన ప్రవర్తనలోనే రావాలి: కళా వెంకట్రావు

  • అక్కసుతోనే దిగజారుడు ఆరోపణలు
  • హైకోర్టు విభజనపై ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?
  • కేసీఆర్ భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది

తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్న గుణాత్మక మార్పు ముందుగా ఆయన ప్రవర్తనలోనే రావాలని  ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పంచన చేరడంతో కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఎవరూ సహకరించడం లేదన్న అక్కసుతోనే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

హైకోర్టు విభజన విషయమై తాము మాట్లాడితే కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆయన విమర్శించారు. ఓవైపు.. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ అంటూనే మరోవైపు మోదీతో కేసీఆర్ చేతులు కలిపారని కళా వెంకట్రావు ఆరోపించారు.

Kala venkat Rao
KCR
Telugudesam
Telangana
congress
BJP
  • Loading...

More Telugu News