Chandrababu: అయితే చంద్రబాబును సీఎంను చేసింది కూడా కేసీఆరేగా?: బాల్క సుమన్ లాజిక్

  • నాడు వైస్రాయ్ హోటల్ ఘటన గురించి ప్రస్తావన
  • ఆ ఘటనకు సిద్ధాంత కర్త కేసీఆరే నని బాబు అన్నారు
  • తనను సీఎం చేసిందీ కేసీఆరేనని బాబు ఒప్పుకున్నట్టే 

నాడు వైస్రాయ్ హోటల్ లో టీడీపీ ఎమ్మెల్యేలను దాచిపెట్టిన ఘటనకు సిద్ధాంత కర్త కేసీఆరే నని సీఎం చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైస్రాయ్ సిద్ధాంత కర్త కేసీఆరే అయితే, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది కూడా ఆయనే కదా? ఈ విషయాన్ని బాబు ఒప్పుకున్నట్టేగా? అంటూ లాజికల్ గా ప్రశ్నించారు.

కేసీఆర్ ని ఇంత పెద్ద నాయకుడిని చేసింది తానేనని చెప్పుకునే అర్హత చంద్రబాబుకు ఎక్కడుంది? అని మండిపడ్డారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం చంద్రబాబు నైజమని, బాబు డ్రామాలు అర్థమైపోయాయని, ఇంకా ఎక్కువ రోజులు ఆ డ్రామాలు నడవవని దుయ్యబట్టారు. ఏపీ మంత్రులు పోటీపడి మరీ, కేసీఆర్ ని విమర్శించారని అన్నారు. కేసీఆర్ ఒక విషయం గురించి మాట్లాడితే చంద్రబాబు మరో విషయం గురించి మాట్లాడుతున్నారని, ఇలాంటి డ్రామాలతోనే కాలం గడుపుకుంటూ ఆయన వస్తున్నారని అన్నారు.

Chandrababu
kcr
balka suman
TRS
Telugudesam
Andhra Pradesh
Telangana
Hyderabad
Telangana bhavan
  • Loading...

More Telugu News