kcr: కేసీఆర్ ఇంటికి మాత్రం రూ.300 కోట్లు కావాలా?: సీఎం చంద్రబాబు విమర్శలు

  • రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు చాలట
  • కేసీఆర్ కు ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ అంటారు
  • కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని ఏం చేశారు?

ఏపీలో రాజధాని నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు ఇచ్చారని, తనపై విశ్వాసంతోనే వారు ఇచ్చిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ విషయమై కూడా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, దీని నిర్మాణానికి రూ.1500 కోట్లు అయితే సరిపోతుందంటున్న ఆయన ఇంటికి మాత్రం రూ.300 కోట్లు కావాలా? అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు ఒక పవిత్రమైన దేవాలయం సెక్రటేరియట్ అని, దాన్ని చూడగానే గౌరవం కలిగేలా ఉండాలని అన్నారు.

కేసీఆర్ కు ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ ఇటీవల చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఆ మెచ్యూరిటీ ఏంటంటే.. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించడం. ఎంత తెలివైన వాడండి! కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాడండి? తెలంగాణ రాష్ట్రం ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని చెప్పారు. అదే ఆయన మెచ్యూరిటీ’ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మోదీ గాడు’ అంటే మోదీకి బాధ లేదు.. అంటే, దాని అర్థమేంటి? లాలూచీ రాజకీయాలేగా? అని విమర్శించారు. ఇష్టపడే ఇద్దరూ తిట్టుకుంటున్నారని, మళ్లీ ఇధ్దరూ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News