Secunderabad: సాధారణ తనిఖీల్లో భాగంగా బైక్ ను ఆపిన పోలీసులు... చలాన్లు చూసి అవాక్కు!

  • సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో తనిఖీలు
  • ఓ బైక్ పై 61 చలాన్ లు
  • రూ. 10,635 వసూలు చేసిన పోలీసులు

తమ సాధారణ తనిఖీల్లో భాగంగా, ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపిన పోలీసులు, ఆ బైక్ పై ఉన్న పెండింగ్ చలాన్ల సంఖ్యను చూసి విస్తుపోయారు. సికింద్రాబాద్ లోని ఆర్పీ రోడ్ పరిధిలో మహంకాళి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఆ దారిలో 'ఏపీ 29 సీఏ 3602' నంబర్ గల బైక్ వచ్చింది. ట్రాఫిక్ ఎస్ఐ కనకయ్య, దాన్ని ఆపి, పీడీఏలో చూడగా, మొత్తం 61 చలాన్ లు పెండింగ్ లో ఉన్నాయి. చలాన్లకు సంబంధించి మొత్తం రూ. 10,635 చెల్లించి, బండిని తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో సదరు వాహనదారుడు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిమానాను చెల్లించాడని పోలీసులు తెలిపారు.

Secunderabad
RP Road
Pending Challans
  • Loading...

More Telugu News