Talasani: చంద్రబాబు, బాలయ్య మళ్లీ మళ్లీ తెలంగాణకు రావాలి: తలసాని వ్యంగ్యం

  • నా భారీ మెజారిటీకి వారిద్దరే కారణం
  • ఏపీలో ఉద్యోగాల కల్పనకు బాబు చేసిందేమీ లేదు
  • టీడీపీ వైఫల్యానికి బాలకృష్ణ కూడా కారణమన్న తలసాని

గడచిన తెలంగాణ ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేసినందునే తనకు భారీ మెజారిటీ వచ్చిందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన తలసాని, సనత్ నగర్ లో ప్రచారం చేసిన వారిద్దరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని, వారు మళ్లీ మళ్లీ రావాలని తాను కోరుతున్నానని అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు, ఏపీలో ఉద్యోగాల కల్పనకు చేసిందేమీ లేదని ఆరోపించిన ఆయన, తెలంగాణలో తెలగుదేశం పార్టీ ఘోరంగా విఫలం కావడానికి బాలయ్య కూడా పరోక్షంగా కారణమేనని ఎద్దేవా చేశారు.

Talasani
Telangana
Elections
Chandrababu
Balakrishna
  • Loading...

More Telugu News