Devineni Uma: అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలే... ముందు ముందు చుక్కలు చూపిస్తాం!: కేసీఆర్ కి దేవినేని ఉమ కౌంటర్

  • అధికారం సొంతమైందని విర్రవీగొద్దు
  • పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం
  • మీడియాతో ఏపీ మంత్రి దేవినేని ఉమ

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయని, తన పార్టీ గెలిచిందని, తిరిగి అధికారం సొంతమైందని కేసీఆర్‌ విర్రవీగుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్, చంద్రబాబుపై విరుచుకుపడగా, ఆ వెంటనే దేవినేని అమరావతిలో మీడియా సమావేశం పెట్టారు.

 ముగిసింది తెలంగాణ ఎన్నికలు మాత్రమేనని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయనకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిచినా కేబినెట్‌ ను ఏర్పాటు చేసుకోలేని అసమర్థుడు కేసీఆర్‌ అని సెటైర్లు వేశారు. ఆయన మాట్లాడే భాష, అసభ్య పదజాలాన్ని ఏ ఒక్కరూ హర్షించరని వ్యాఖ్యానించిన దేవినేని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.

Devineni Uma
KCR
Telangana
Elections
  • Loading...

More Telugu News