KCR: ఐటీలో చంద్రబాబు పీకిందేం లేదు: కేసీఆర్ ధ్వజం

  • ఆర్థిక నమూనాపై అవగాహన లేదు
  • భౌగోళిక అనుకూలతల వల్లే ఐటీ కంపెనీలు
  • చంద్రబాబులా డబ్బా కొట్టుకోవట్లేదు

హైదరాబాద్‌కు భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ కంపెనీలొచ్చాయని.. అందులో ఏపీ సీఎం చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేడు ప్రగతి భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీలో చంద్రబాబు పీకిందేం లేదంటూ ధ్వజమెత్తారు. తాను ప్రతిపాదించే ఆర్థిక నమూనాపై చంద్రబాబుకు కనీస అవగాహన కూడా లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

సైబర్ టవర్స్‌కు పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని, దాంతో చంద్రబాబుకు సంబంధం లేదని అన్నారు. తాము కూడా రాష్ట్రానికి నాలుగైదు పెద్ద ఐటీ కంపెనీలను తెచ్చినప్పటికీ చంద్రబాబులా డబ్బా కొట్టుకోవట్లేదన్నారు. కల్యాణ లక్ష్మి, పారిశ్రామిక రాయితీలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. తాము అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం అనుసరిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.

KCR
Chandrababu
Nedurumalli Janardhan Reddy
Cyber Towers
  • Loading...

More Telugu News