srivishnu: క్రైమ్ కామెడీగా 'బ్రోచేవారెవరురా'

  • కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే శ్రీవిష్ణు 
  • ప్రధాన కథానాయికగా నివేదా థామస్ 
  • మరో నాయికగా నివేదా పేతురాజ్  

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వైవిధ్యభరితమైన పాత్రలే ఆయనకి మంచి పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇక కథానాయికగా నివేదా థామస్ కి తెలుగు ప్రేక్షకుల్లో వున్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది.విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తోన్న ఈ సినిమాకి విష్ణు దర్శకుడు. మరో కథానాయికగా నివేద పేతురాజ్ కనిపించనుంది. క్రైమ్ కామెడీగా రూపొందనున్న ఈ సినిమాకి, 'బ్రోచేవారెవరురా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సత్యదేవ్ .. రాహుల్ .. ప్రియదర్శి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో ఇంతవరకూ వచ్చిన క్రైమ్ కామెడీ చిత్రాల జాబితాలో ఈ సినిమా ముందువరుసలో నిలవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

srivishnu
Niveda Thomas
  • Loading...

More Telugu News