Telangana: మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్న సీఎం కేసీఆర్!

  • మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ
  • ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై వివరణ
  • ప్రగతిభవన్ లో జరగనున్న సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మారికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనతో పాటు ఇటీవల దేశవ్యాప్తంగా తన ‘ఫెడరల్ ఫ్రంట్’ పర్యటన వివరాలను మీడియాతో ఆయన పంచుకోనున్నారు. అలాగే డిసెంబర్ 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయినప్పటికీ ఇంకా కేబినెట్ ఏర్పాటు కాని నేపథ్యంలో ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై ఆయన క్లారిటీ ఇస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ అంతకుముందు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై వివక్షాలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ ప్రగతిభవన్ లో మీడియా సమావేశంలో సమాధానం ఇవ్వనున్నారు.

Telangana
KCR
pressmeet
Chief Minister
federal front
  • Loading...

More Telugu News