jayalalitha: జయలలిత డెత్ మిస్టరీ: అర్ముగస్వామి కమిషన్‌పై అపోలో ఆసుపత్రి సంచలన ఆరోపణలు

  • రికార్డుల నమోదు తప్పుల తడకగా ఉందన్న అపోలో
  • పరిశీలన కోసం 21 మంది వైద్యులతో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
  • తెలిసీ తెలియకుండా వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారని మండిపాటు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణ జరుపుతున్న జస్టిస్ అర్ముగస్వామి కమిషన్‌పై అపోలో ఆసుపత్రి యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది. కమిషన్ నమోదు చేసిన వాంగ్మూలాలు మొత్తం తప్పుల తడకని మండిపడింది. జయలలితకు చికిత్స అందించిన రికార్డులను పరిశీలించేందుకు ప్రపంచంలోని వైద్య రంగంలో వివిధ విభాగాలకు చెందిన 21 మంది నిపుణులతో ఓ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. తెలిసీ తెలియకుండా వాంగ్మూలాలను నమోదు చేయడం సరికాదని ధ్వజమెత్తింది. ఇలా చేయడం వల్ల కేసు తప్పుదోవ పడుతుందని పేర్కొంది. ఈ మేరకు అర్ముగస్వామికి ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది.

జయలలితకు చికిత్స అందించిన వివరాలను వెల్లడించడం అంత ఈజీ కాదని పేర్కొన్న అపోలో ఆసుపత్రి.. కమిషన్ టైపిస్టుకు వైద్య పరిభాషపై అవగాహన లేక చాలా విషయాలను తప్పుగా అన్వయం చేసుకుని టైప్ చేశారని పేర్కొంది. ‘ఇంటుబేషన్’ అనే పదాన్ని ‘ఇంక్యుబేషన్’ అని టైప్ చేశారని, ఇటువంటి పొరపాట్లు చాలానే ఉన్నాయని, కాబట్టి సమగ్ర పరిశీలన కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News