shamshabad: శంషాబాద్ ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్!

  • రోడ్డు మరమ్మతులు.. వాహనదారులకు ఇబ్బంది
  • వేల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు
  • అయినప్పటికీ స్పందించని పోలీసులు, అధికారులు

శంషాబాద్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ, పోలీసులు గానీ, సంబంధిత అధికారులు గానీ స్పందించడం లేదని వాహనదారులు ఆరోపించారు. కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సిన ప్రయాణికుల వాహనాలు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. దీంతో, తాము ఎక్కాల్సిన విమానం మిస్సవుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

shamshabad
airport
pv narasimha rao fly over
traffic
vehicles
police
two-wheelers
  • Loading...

More Telugu News