melbourne: 54 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • రెండో ఇన్నింగ్స్ లో తడబడ్డ టీమిండియా
  • పుజారా, కోహ్లీ డకౌట్
  • నాలుగు వికెట్లు తీసిన కమ్మిన్స్

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. 54 పరుగులకే 5 వికెట్లు పడిపోయాయి. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... రెండో ఇన్నింగ్స్ లో చతికిలపడింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 151 పరుగుల వద్ద ఆలౌటైన తర్వాత... ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా, ఇండియా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఆసీస్ బౌలర్ కమిన్స్ దెబ్బకు మన బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.

జట్టు స్కోరు 28 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ హనుమ విహారి (13) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పుజారా (0), కోహ్లీ (0), రహానే (1), రోహిత్ శర్మ (5)లు వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28), రిషభ్ పంత్ (6)లు నాటౌట్ గా నిలిచారు. కమిన్స్ 4 వికెట్లు తీయగా... హ్యాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం టీమిండియా 346 పరుగుల ఆధిక్యతను సాధించింది.

  • Loading...

More Telugu News