Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో అన్ని సీట్లకూ పోటీ చేస్తాం!: జనసేన నేత నాదెండ్ల మనోహర్

  • ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోం
  • ఒంటరిగానే ఎన్నికలకు వెళతాం
  • మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని విపక్ష వైసీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేనతో తాము జట్టుకట్టే ప్రసక్తే లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం స్పందించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనతరంగం కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే జనసేన కార్యాచరణను ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
nadendla manohar
2019 ap elections
announcements
175 seats
  • Loading...

More Telugu News