Telangana: కేసీఆర్ ను ఇకపై విమర్శించను.. మీరూ టీఆర్ఎస్ కార్యకర్తలతో పెట్టుకోవద్దు!: కాంగ్రెస్ శ్రేణులకు జగ్గారెడ్డి ఆదేశం

  • పార్టీని కాపాడుకోవడం కోసం భారీగా డబ్బు కావాలి
  • అందుకోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తా
  • మల్కాపూర్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి

గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇకపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వాన్ని విమర్శించబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో వైరం పెట్టుకోవద్దని సూచించారు. సంగారెడ్డిలోని మల్కాపూర్ లో ఈరోజు నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, కార్యకర్తల అవసరాల కోసం ఇప్పుడు బాగా డబ్బు కావాలని జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తానని ప్రకటించారు. తెలంగాణలో మళ్లీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ విజయం కోసం ఆస్తులు అమ్ముకోవడానికైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కార్యకర్తలు ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయికి రెట్టింపు మొత్తాన్ని ఇస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

Telangana
Congress
TRS
KCR
jagga reddy
shocking comments
sanga reddy
  • Loading...

More Telugu News