Andhra Pradesh: కేంద్రంపై కొత్త నిరసన.. శివుడి వేషధారణలో పార్లమెంటుకు టీడీపీ నేత శివప్రసాద్!

  • పార్లమెంటు ఆవరణలో టీడీపీ నేతల ఆందోళన
  • ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుకు డిమాండ్
  • కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రంపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈరోజు కూడా పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. కడప ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో అనధికార ఎమర్జెన్సీ విధించారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేత శివప్రసాద్ శివుడి వేషధారణలో పార్లమెంటుకు చేరుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ సహా విభజన చట్టంలోని పలు హామీల విషయంలో మోదీ సర్కారు ఆంధ్రులను మోసం చేసిందని శివప్రసాద్ అన్నారు. మరోపక్క, కావేరీ నదిపై డ్యామ్ కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు పలికారు.

Andhra Pradesh
India
Narendra Modi
Telugudesam
parliament
mps
agitation
  • Loading...

More Telugu News