New Delhi: ఢిల్లీపై గురి.. దేశ రాజధానిలో టీఆర్ఎస్ ఆఫీసు పెట్టనున్న కేసీఆర్!
- ప్రారంభమైన స్థల పరిశీలన
- 1000 గజాలు ఇచ్చేందుకు సర్కారు ఓకే
- ఫెడరల్ ఫ్రంట్ పై జోరుపెంచిన గులాబీ అధినేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాలకు వీలుగా ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయించారు.
ఇందుకోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, టీఆర్ఎస్ కార్యాలయం కోసం అక్కడి ప్రభుత్వం 1000 గజాల స్థలం కేటాయించడానికి అంగీకరించినట్లు సమాచారం.