vinaya vidhyeya Rama: టీ కప్పు విప్లవం సృష్టించడం ఖాయం.. బాబాయ్ పవన్‌కు బాసటగా రాం చరణ్

  • ప్రజల కోసం పవన్ యుద్ధం చేస్తున్నారు
  • ఆయనను చూస్తుంటే ఆనందంగా ఉంది
  • నాన్నగారి దయవల్ల సముద్రమంత కుటుంబం లభించింది

హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు రాం చరణ్ మాట్లాడుతూ.. జనసేన అధినేత, బాబాయ్ పవన్ కల్యాణ్‌‌కు మద్దతు పలికాడు. జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ను గుర్తు చేస్తూ ఈ టీ కప్పు ఏదో ఒక రోజు పెను విప్లవం తీసుకొస్తుందన్నాడు. ఈ మధ్య అందరూ జ్యూస్‌లు, కాఫీలు తాగడం లేదని, టీ తాగుతున్నారని చమత్కరించాడు. ఈ టీకప్పు విప్లవం సృష్టించడం ఖాయమని మనస్ఫూర్తిగా చెబుతున్నట్టు పేర్కొన్నాడు.

బాబాయ్ పవన్ కల్యాణ్ జనం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారని, ఆయనను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అయితే, ఆయన కష్టాన్ని చూస్తుంటే మాత్రం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాన్న గారి దయవల్ల తమకు సముద్రమంత కుటుంబం లభించిందని, అందుకు జీవితాంతం రుణపడి ఉంటామని చరణ్ పేర్కొన్నాడు.

vinaya vidhyeya Rama
Ramcharan
Pawan Kalyan
Jana Sena
Tea glass
  • Loading...

More Telugu News