Telangana: తెలంగాణలో ఓట్ల తొలగింపుతో మా పార్టీకి నష్టం జరిగింది: సీఈసీకి కేసీఆర్ ఫిర్యాదు

  • ఢిల్లీలో సీఈసీని కలిసిన కేసీఆర్
  • తొలగించిన ఓట్ల  విషయమై పరిశీలించాలి
  • లోక్ సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలి

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాను కేసీఆర్ ఈరోజు కలిశారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుతో తమ పార్టీకి నష్టం జరిగిందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. తొలగించిన ఓట్ల విషయమై పరిశీలించాలని, లోక్ సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలని కేసీఆర్ కోరారు.

 అలాగే, తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలిన గుర్తులు ఇతర పార్టీలకు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో తికమకపడుతున్నారని సీఈసీ దృష్టికి తెచ్చారు. కాగా, కేసీఆర్ వెంట టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్ ఉన్నారు. 

Telangana
kcr
delhi
cec
sunil arora
voters
  • Loading...

More Telugu News