Andhra Pradesh: సీఎం చంద్రబాబు శరీరంలో ఉండేది 70 శాతం కాంగ్రెస్ రక్తమే!: నటుడు పృథ్వీ తీవ్ర వ్యాఖ్యలు

  • ప్రత్యేకహోదాను ఆడపిల్ల అన్నారు
  • నల్లారి గోల్ఫ్ ఆడుకుంటున్నారు
  • వంచనపై గర్జన దీక్షలో విమర్శలు

ప్రత్యేకహోదాను ఆడపిల్లగా, ప్యాకేజీని మగపిల్లాడిగా పోల్చిన ఘనచరిత్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిదేనని ప్రముఖ నటుడు పృథ్వీ విమర్శించారు. లాస్ట్ బాల్ అంటూ కబుర్లు చెప్పిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గోల్కొండ కోర్టులో గోల్ఫ్ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కారణంగానే ఇంకా ఏపీలో ప్రత్యేకహోదా డిమాండ్ సజీవంగా ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వైసీపీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పృథ్వీ మాట్లాడారు.

సంక్రాంతి పండుగకు హరిదాసు వచ్చినట్లు ఏపీలో కొందరు నేతలు సరిగ్గా ఎన్నికల ముందు ప్రజల వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం నుంచి కూకట్ పల్లి వరకూ తెలంగాణ ప్రజలు మహాకూటమిని చాచిపెట్టి కొట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి నాయకుడిని తాను ఇంతవరకూ చూడలేదన్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు చంద్రబాబు సిగ్గుపడాలని విమర్శించారు. తన శరీరంలో 70 శాతం కాంగ్రెస్ రక్తమే ఉందని చంద్రబాబు ఓసారి చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాజన్న సంక్షేమ రాజ్యం వస్తుందని పృథ్వీ జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Chandrababu
Telugudesam
criticise
Congress
actor
prudhvi
  • Loading...

More Telugu News