Chennai: ఇద్దరు రైల్వే ఉద్యోగులను బలిగొన్న కావేరీ ఎక్స్ ప్రెస్!

  • కర్ణాటకలోని వరదాపురం వద్ద ఘటన
  • పట్టాలను తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కావేరీ ఎక్స్ ప్రెస్
  • రైలును గమనించనందునే ప్రమాదమన్న అధికారులు

చెన్నై - మైసూరు మధ్య తిరిగే కావేరీ ఎక్స్ ప్రెస్, ఇద్దరు రైల్వే ఉద్యోగులను ఢీకొనగా, ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ తెల్లవారుజామున ఇద్దరు కార్మికులు పట్టాలను తనిఖీ చేసే పనిలో నిమగ్నమై ఉండగా, కావేరీ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొంది. కర్ణాటకలోని గుడిపల్లి - బంగారుపేట మధ్య ఉన్న వరదాపురం వద్ద ఈ ఘటన జరిగింది.

వీరిలో ఒకరు శాంతిపురం మండలానికి చెందగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తని అధికారులు తెలిపారు. రైలు వస్తున్న విషయాన్ని వీరిద్దరూ గమనించనందునే ప్రమాదం జరిగిందని తేల్చిన అధికారులు, నిబంధనల ప్రకారం వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Chennai
Mysore
Kaveri Express
Train Accident
  • Loading...

More Telugu News