Honor V20: 48 మెగా పిక్సెల్ కెమెరాతో 'ఆనర్ వీ20' స్మార్ట్ ఫోన్ విడుదల

  • చైనాలో విడుదలైన 'ఆనర్ వీ20'
  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • త్వరలోనే భారత మార్కెట్లోకి

ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ ఆనర్ తాజాగా చైనాలో నూతన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. వెనక భాగంలో 48 మెగా పిక్సెల్ కెమెరాతో 'ఆనర్ వీ20' ని మార్కెట్లో విడుదల చేసింది. ముందు భాగంలో 25 మెగా పిక్సెల్ కెమెరా, అధునాతన హైసిలికాన్ ప్రాసెసర్ తో పాటు భారీ బ్యాటరీని (4000ఎంఏహెచ్) దీనిలో ఏర్పాటు చేశారు. 6 జీబీ/ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో చార్మ్ బ్లూ, రెడ్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. 6 జీబీ ర్యామ్ ఫోన్ ధర మనదేశంలో సుమారు రూ.30,400 ఉండనుండగా, 8 జీబీ ర్యామ్ ఫోన్ ధర సుమారు రూ.35,500గా ఉండనుంది.

Honor V20
smart phone
Tech-News
technology
China
honor
  • Loading...

More Telugu News