ys: వైఎస్ కు వీరారెడ్డి చుక్కలు చూపించేవారు.. 2019 ఎన్నికల్లో గెలిచి పెద్దాయనకు నివాళి అర్పిస్తాం!: మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • చంద్రబాబును సీఎం చేయడంలో కీలకంగా ఉన్నారు
  • వీరారెడ్డి గొప్ప రాజనీతజ్ఞుడని కితాబు
  • వర్ధంతి కార్యక్రమంలో నివాళులు అర్పించిన నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబును అప్పట్లో ముఖ్యమంత్రిని చేయడంలో బిజివేముల వీరారెడ్డి కీలకంగా వ్యవహరించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. వీరారెడ్డి ఆదర్శనేత అనీ, గొప్ప రాజనీతజ్ఞుడని ప్రశంసించారు. కడప జిల్లా బద్వేలులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరారెడ్డి చుక్కలు చూపించేవారని అన్నారు. బద్వేలులో వీరారెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సోమశిల ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే బద్వేలుకు వెటర్నరీ కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 2019లో టీడీపీ జెండాను మరోసారి ఎగురవేసి పెద్దాయన వీరారెడ్డికి నిజమైన నివాళి అర్పిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యేలు విజయమ్మ, లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ys
veera reddy
Andhra Pradesh
Kadapa District
badwell
2019 election
minister
adi narayana reddy
Telugudesam
death anniversary
  • Loading...

More Telugu News