Sadik: పాతబస్తీలో స్థల వివాదంలో కాల్పుల కలకలం

  • ఉమర్, సాదిక్‌ల మధ్య ఘర్షణ
  • గాల్లోకి కాల్పులు జరిపిన సాదిక్
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

స్థల వివాదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ కాల్పులకు దారి తీయడంతో పాతబస్తీలో కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన షేక్ ఉమర్, సాదిక్‌ల మధ్య స్థలం విషయంలో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘర్షణ జరిగింది. దీంతో సాదిక్ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాతబస్తీ ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాదిక్‌ను అదుపులోకి తీసుకుని.. అతని వద్ద ఉన్న పాయింట్ 32 పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Sadik
Umar
Hyderabad
Old city
Hussani Alam
  • Loading...

More Telugu News