Johney Deep: 'జాక్ స్పారో' ఇక జానీ డెప్ కాదట!

  • ఇప్పటికే ఐదు భాగాలుగా వచ్చిన 'ది పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌'
  • త్వరలోనే ఆరో భాగం షూటింగ్
  • కొత్త హీరోను ఇంకా ప్రకటించని నిర్మాతలు

జాక్ స్పారో... ఈ పేరు వినగానే తొలుత గుర్తుకు వచ్చేది హాలీవుడ్‌ లో ఘనవిజయం సాధించిన 'ది పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌' చిత్రం, దానితో పాటు జాక్ పాత్రను పోషించి మెప్పించిన జానీ డెప్. ఇప్పటికే ఐదు భాగాలుగా సినిమా సిరీస్ విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలో ఆరోభాగం షూటింగ్ ప్రారంభం కానుండగా, జాక్‌ స్పారో పాత్రలో ఇక సూపర్‌ స్టార్‌ జానీ డెప్‌ కనిపించరట.

 ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. పద్నాలుగేళ్ల క్రితం తొలి 'ది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రం విడుదల కాగా, ఆపై మరో నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక జానీ డెప్ ను తొలగించిన కారణాన్ని మాత్రం నిర్మాతలు వెల్లడించలేదు. కొత్త జాక్ స్పోరోగా ఎవరు నటిస్తారన్న విషయం తెలియాల్సివుంది.

Johney Deep
Jack Sparow
Pairates of the Currebian
  • Loading...

More Telugu News