Guntur District: కుమార్తెకు సీమంతం చేసి ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం.. తల్లీ కుమార్తెల మృతి

  • గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘటన
  • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
  • ముగ్గురి మృతి.. మరో ముగ్గురు ఆసుపత్రి పాలు

కుమార్తెకు ఘనంగా సీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్తున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. పుట్టబోయే బిడ్డ గురించి కోటి కలలు కంటూ ఇంటికి బయలుదేరిన ఆమె కలలను రోడ్డు ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు మధ్యలోనే తుంచేసింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని యడవల్లిలో జరిగిన ఈ ఘటన హృదయాలను కలచివేసింది.

ఆదివారం అర్ధరాత్రి తల్లీ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మృతులను గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Guntur District
Chilakaluripeta
Road Accident
Andhra Pradesh
  • Loading...

More Telugu News