mamata banerjee: నిర్దిష్ట ప్రణాళికతో త్వరలోనే ముందుకు వస్తాం: కోల్ కతాలో కేసీఆర్

  • ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది
  • ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి
  • మమతతో జాతీయ రాజకీయాలపై చర్చించా

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మమతతో జాతీయ రాజకీయాలపై చర్చించానని తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్దిష్టమైన వ్యూహంతో ముందుకు వస్తామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. కాసేపట్లో కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. 26 లేదా 27న ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

mamata banerjee
federal front
kct
tmc
TRS
  • Loading...

More Telugu News