Sai Pallavi: జయలలిత బయోపిక్ లో సాయిపల్లవి!

  • వివిధ భాషల్లో బయోపిక్ ల జోరు 
  • తమిళంలో జయలలితపై రెండు చిత్రాలు 
  • నిత్యామీనన్ నాయికగా 'ది ఐరన్ లేడీ'   

ఇప్పుడు ఏ భాషలో చూసినా బయోపిక్ ల నిర్మాణం ఊపందుకుంది. ప్రేక్షకుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తుండడంతో దర్శక నిర్మాతలు కూడా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో తమిళంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితంపై ప్రస్తుతం రెండు చిత్రాలు నిర్మితమవుతున్నాయి. వీటిలో ఒకటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రధారిణిగా 'ది ఐరన్ లేడీ' పేరిట తెరకెక్కుతోంది.

అలాగే, బాలీవుడ్ భామ విద్యాబాలన్ నాయికగా దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో జయలలిత మిత్రురాలు శశికళ పాత్ర కూడా ప్రాధాన్యం కలిగివుంటుందట. దాంతో ఈ పాత్రకు తాజాగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.   

Sai Pallavi
Jayalalitha
Nitya Menon
Vidyabalan
  • Loading...

More Telugu News