trisha: త్రిషతో డేటింగ్ చేశాను.. కానీ వర్కవుట్ కాలేదు!: దగ్గుబాటి రానా

  • కాఫీ విత్ కరణ్ షోలో రానా
  • పెళ్లి విషయమై ప్రశ్నించిన కరణ్
  • త్రిషతో ప్రేమ విషయం ప్రస్తావన

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి హీరోలు ప్రభాస్, రానాతో పాటు దర్శకుడు రాజమౌళి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొంటె ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెట్టేందుకు కరణ్ యత్నించాడు. ప్రోగ్రామ్ లో భాగంగా ప్రభాస్, రానాలను పెళ్లి విషయమై కరణ్ ప్రశ్నించాడు.

మీరు ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారా? అని కరణ్ రానాను అడిగాడు. దీంతో రానా ‘లేదు నేను ఇంకా సింగిల్ గానే ఉన్నా’ అని జవాబిచ్చాడు. దీంతో వెంటనే కరణ్ త్రిషతో గతంలో రానా ప్రేమాయణం విషయాన్ని ప్రస్తావించాడు. దీనిపై రానా స్పందిస్తూ..‘త్రిష, నేను మంచి స్నేహితులం. తను నాకు పదేళ్ల నుంచి తెలుసు. కొంతకాలం మేమిద్దరం డేటింగ్ కూడా చేశాం. కానీ వర్కవుట్ కాలేదు’ అని చెప్పాడు.

సరైన సమయం వస్తే పెళ్లి దానంతట అదే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా రానా పెళ్లిపై రాజమౌళి మాట్లాడుతూ.. రానా ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళుతున్నాడనీ, ఏ వయసులో ఏది చేయాలో అది చేస్తాడని అన్నారు. పెళ్లి విషయం కూడా అందులోనే ఉంటుందన్నారు. ఇక ప్రభాస్ కు పెళ్లి చేసుకోవాలంటే బద్దకమని వ్యాఖ్యానించారు.

trisha
rana
Prabhas
Rajamouli
coffee with karan
love affair
dating
  • Loading...

More Telugu News