tribal people: గిరిజనులతో కలిసి చిందేసిన జగన్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు!

  • శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర
  • నేడు కొత్తూరు క్రాస్ నుంచి ప్రారంభం
  • ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 330వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కొత్తూరు క్రాస్‌ నుంచి డీ పోలురు క్రాస్‌, చింతల పోలురు క్రాస్‌, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు జగన్ పాదయాత్ర సాగనుంది. కాగా, ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో జగన్ కు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పలువురు ఆదివాసీలతో కలిసి జగన్ గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈరోజు సాయంత్రం మిళియపుట్టి వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

tribal people
Jagan
YSRCP
Social Media
viral pics
dance
prajasankalpa yatra
  • Loading...

More Telugu News