ramulu naik: నన్ను చంపాలని కుట్ర చేస్తున్నారు: టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపణలు

  • నాకు ప్రాణ భయం ఉంది
  • ఏడాది క్రితం నుంచే టార్గెట్ చేశారు
  • కోర్టును ఆశ్రయించబోతున్నా

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణ భయం ఉందని... ప్రాణ రక్షణ కోసం తాను కోర్టును ఆశ్రయించబోతున్నానని చెప్పారు. ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారని... ఏదో ఒక కేసులో ఇరికించడం కానీ, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కానీ చేయాలనుకున్నారని మండిపడ్డారు. తనకు ఏదైనా జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. గిరిజనుల తరపున మాట్లాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.

పార్టీ ఫిరాయింపులపై ఈనెల 18న తనకు నోటీసు వచ్చిందని.. దానికి వివరణ ఇచ్చానని... పూర్తి వివరాలు ఇవ్వడానికి నాలుగు వారాల గడువు కావాలని కోరానని రాములు నాయక్ తెలిపారు. అయితే తన విన్నపాన్ని శాసనమండలి ఛైర్మన్ తిరస్కరిస్తున్నారని విమర్శించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని... గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీనని చెప్పారు. సోషల్ వర్క్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చిందని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా పార్టీ మారిన వ్యక్తేనని దుయ్యబట్టారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరోనే లేదని... కానీ, తనను పొలిట్ బ్యూరో మెంబర్ గా పేర్కొంటూ ఫిర్యాదు చేశారని వాపోయారు. 

ramulu naik
TRS
death threat
mlc
telangana
  • Loading...

More Telugu News