Jagan: జగన్ అన్న పాదయాత్రలో ఉండిపోయాడు.. అందుకే ఈసారి కలుసుకోలేకపోతున్నాం!: వైఎస్ షర్మిల

  • ప్రజాసంకల్ప యాత్రలో జగన్
  • క్రిస్మస్ వేడుకలకు వెళ్లని వైనం
  • ట్విట్టర్ లో స్పందించిన సోదరి షర్మిల

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరి షర్మిల ట్విట్టర్ లో స్పందించారు. కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో అందరం కలుసుకుంటామని షర్మిల తెలిపారు.  

కానీ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఉండటంతో ఈసారి కుటుంబ సభ్యులు కలుసుకోవడం కుదరలేదని వెల్లడించారు. తల్లి విజయమ్మ, మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నాన్నగారికి నివాళి అర్పించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షర్మిల ఓ ట్వీట్ చేశారు.

Jagan
YSRCP
prajasankalpa yatra
ys sharmila
xmas
celebration
YSr
Twitter
family
reunion
  • Loading...

More Telugu News