maoist: మావోయిస్ట్ సానుభూతిపరుడు నక్కా వెంకట్రావు అరెస్ట్.. పేలుడు పదార్థాల స్వాధీనం!

  • హైదరాబాద్ ఎన్జీఆర్ఐ లో పనిచేస్తున్న నక్కా
  • ఛత్తీస్ గఢ్ లో పట్టుకున్న పోలీసులు
  • మావో కేంద్ర కమిటీకి అత్యంత సన్నిహితుడు

మావోయిస్టుల సానుభూతిపరుడు, హైదరాబాద్ వాసి నక్కా వెంకట్రావును ఛత్తీస్ గఢ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు బాంబులకు అవసరమయ్యే పేలుడు పదార్థాలను తీసుకెళుతుండగా పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీకి అత్యంత సన్నిహితుడైన నక్కా వెంకట్రావు, పట్టణ ప్రాంతాల్లో నక్సలిజం వ్యాప్తిలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇతను హైదరాబాద్ లోని నేషనల్ జియో ఫిజికల్ ఇన్ స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ)లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని వెల్లడించారు.

మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్న వెంకటరావు.. 2016,2017లో కేంద్ర కమిటీతో భేటీ అయినట్లు పోలీసులు చెప్పారు. ఇతను ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టులకు సహాయసహకారాలు అందజేస్తున్నాడని వెల్లడించారు. వెంకట్రావు కదలికలపై నిఘాతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పేర్కొన్నారు. మరికాసేపట్లో కోర్టు ముందు నిందితుడిని హాజరుపరిచి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. కాగా, వెంకట్రావు అమాయకుడనీ, పోలీసులు ఆయన్ను తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

maoist
chattisgargh
nakka
venkatarao
Police
arrest
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News