Prabhas: ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదంటే..: రాజమౌళి

  • టాలీవుడ్ లో ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్
  • పెళ్లి చేసుకోవాలంటే బద్ధకంగా అనుకుంటాడు
  • రానా మాత్రం ప్లాన్ ప్రకారమే వెళ్తాడన్న రాజమౌళి

నాలుగు పదుల వయసుకు దగ్గరపడినా టాలీవుడ్ లో ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్, ఇప్పటికీ తన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇక ఇదే విషయాన్ని 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమంలో కరణ్ జొహార్ ప్రస్తావిస్తూ, దర్శకుడు రాజమౌళి దగ్గర ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నను ఉంచారు.

దీనిపై సరదాగా స్పందించిన రాజమౌళి, ప్రభాస్‌ చాలా బద్దకిస్టని, పెళ్లి చూపులు చూడటం, శుభలేఖలు పంచడం, రెండు మూడు రోజుల పెళ్లి వేడుక... ఇదంతా చాలా సమయాన్ని తీసుకుంటుందని అనుకుంటాడని, అందుకే ప్రభాస్, పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.

ఇలా కాకుండా 'ఓ అమ్మాయితో మూవ్‌ కావచ్చుగా?' అని కరణ్‌ అడగ్గా, ప్రభాస్‌ అలా చేసే వ్యక్తి కాడని, పెళ్లిని మాత్రం చాలా లేజీగా అనుకునే రకమని అన్నారు. ఇక ఇదే ప్రశ్నను రానా గురించి అడిగితే, అతను ఓ పథకం ప్రకారం ముందుకు వెళ్తాడని చెప్పిన రాజమౌళి, ఏ వయస్సులో ఏది చేయాలో అది చేసే రకం రానా అన్నారు.

Prabhas
Rajamouli
Rana
Coffee with Karan
Marriage
  • Loading...

More Telugu News