ntr: ఎన్టీఆర్ కు మేకప్ వేసిన తొలి బయటి వ్యక్తిని నేనే!: మోహన్ బాబు

  • ఎన్టీఆర్ కు పర్సనల్ మేకప్ మెన్ ఉండేవారు
  • ఇతరులను ఆయన అంగీకరించేవారు కాదు
  • మేజర్ చంద్రకాంత్ షూటింగ్ ను గుర్తుచేసుకున్న నటుడు

ఒకే తల్లికి పుట్టకపోయినా తాను, మహానటుడు ఎన్టీఆర్ అన్నదమ్ములమేనని డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎక్కువగా అంటుంటారు. ఎన్టీఆర్ తో తనకు అంతటి అనుబంధం వుందని ఆయన అంటారు. తాజాగా ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన సమయంలో తన అనుభవాలను మోహన్ బాబు పంచుకున్నారు. ఎన్టీఆర్ తన మేకప్ కోసం పర్సనల్ మేకప్ మెన్ కే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. ఇతరులను ఆయన అంగీకరించేవారు కాదన్నారు.

పర్సనల్ మేకప్ మెన్ కాకుండా అన్నగారికి మేకప్ వేసిన తొలి వ్యక్తిని తానేనని గర్వంగా చెప్పారు. మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలో ‘పుణ్యభూమి నా దేశం’ పాట కోసం ఎన్టీఆర్ చాలా గెటప్పులు వేశారని గుర్తుచేసుకున్నారు. ఆయనకు ఈ సందర్భంగా తానే మేకప్ వేశానని చెప్పుకొచ్చారు.

షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ సమయపాలనను కచ్చితంగా పాటించేవారనీ, ఉదయం 7 గంటలకే స్పాట్ కు వచ్చేసేవారని తెలిపారు. ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తని వ్యాఖ్యానించారు. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ తో దిగిన ఓ ఫొటోను ఈ సందర్భంగా మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకున్నారు..

ntr
mohan babu
major chandrakanth
makeup
Twitter
  • Loading...

More Telugu News