Actress Goutami: అమ్మాయిలపైనే కాదు.. అబ్బాయిలపైనా లైంగిక వేధింపులు: సినీ నటి గౌతమి

  • ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
  • యోగా అద్భుతాలు చేస్తుంది
  • కేన్సర్ నుంచి నన్ను బయటపడేసింది అదే

దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై సినీ నటి గౌతమి స్పందించింది. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయిందని,  వారు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. చట్ట విరుద్ధ చర్యలను అడ్డుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వాలేనని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

కేన్సర్ బారిన పడిన తాను ఎలా కోలుకున్నదీ చెబుతూ.. యోగా అద్భుతాలు చేస్తుందని పేర్కొంది. యోగా వల్లే తాను కేన్సర్ నుంచి బయటపడగలిగానని వివరించింది. యోగాసనాల వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మొగ్గ దశలోనే తుంచివేయవచ్చని పేర్కొంది. యోగా కారణంగానే తానిప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు గౌతమి తెలిపింది. 

Actress Goutami
Abuse
Boys
Cancer
Yoga
  • Loading...

More Telugu News