Andhra Pradesh: వైసీపీకి చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్.. టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే!

  • చంద్రబాబుతో సమావేశమైన వైసీపీ నేత
  • పార్టీలోకి రావాలని ఆహ్వానించిన బాబు
  • త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్న కొమ్మి

నెల్లూరు జిల్లా వైసీపీకి షాక్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టీడీపీలో చేరేలా ఆయన పావులు కదిపారు. ఇందులో భాగంగా శుక్రవారం లక్ష్మయ్య నాయుడితో సమావేశమైన చంద్రబాబు.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం టికెట్ పై చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ విషయమై కొమ్మి స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రితో 30 నిమిషాలు సమావేశం అయ్యాయని తెలిపారు. చంద్రబాబుతో చర్చలు సంతృప్తి ఇచ్చాయనీ, త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. చంద్రబాబు తనకు ఏం ఆఫర్ ఇచ్చారో బహిరంగంగా చెప్పలేనని వ్యాఖ్యానించారు.

ఆనం కుటుంబీకులు టీడీపీని వీడటంతో చంద్రబాబు ఆత్మకూరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేత బొల్లినేని కృష్ణయ్యను బాబు రంగంలోకి దింపారు. అంతేకాకుండా నెల్లూరు జెడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కూడా పార్టీలోకి తెచ్చుకునే దిశగా చర్చలు సాగిస్తున్నారు. 

Andhra Pradesh
Nellore District
atmakur
Telugudesam
YSRCP
kommi
lakshmaiah naidu
ex mla
join
  • Loading...

More Telugu News