Andhra Pradesh: జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న సినీ నటుడు భానుచందర్!

  • పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నటుడు
  • నేడు పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశం
  • 329వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 329వ రోజు పాదయాత్రలో భాగంగా టెక్కలి నుంచి నుంచి గూడెం, సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్‌, నర్సింగపల్లి, జగన్నాధపురం వరకూ జగన్ నడుస్తారు. అనంతరం కుంచుకోట మీదుగా పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. జిల్లాలోని కొత్తూరు క్రాస్‌ వరకూ ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది. కాగా, ఈరోజు జగన్ పాదయాత్రలో భాగంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

పాదయాత్రలో భాగంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్ జగన్ ను కలుసుకున్నారు. టెక్కలిలో జగన్ పాదయాత్ర మొదలైన వెంటనే జగన్ తో చేతులు కలిపి కొద్దిదూరం పాటు ఆయనతో కలిసి అడుగులో అడుగు వేశారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ.. జగన్ ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని చెప్పారు. జగన్ అంటే తనకు చాలా అభిమానమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Jagan
YSRCP
prajasankalpa yatra
Srikakulam District
bhanu chandar
  • Loading...

More Telugu News