Guntur District: రాళ్లు, సీసాలతో కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు.. గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

  • టీడీపీ ఫ్లెక్సీ ముందే వైసీపీ ఫ్లెక్సీ
  • ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన గొడవ చినికిచినికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులో టీడీపీ శ్రేణులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని, అప్పటికే టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న ఓ ఫ్లెక్సీ ముందు వైసీపీ కార్యకర్తలు తమ ఫ్లెక్సీని పెట్టారు.

శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైసీపీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. ఇది చూసిన వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. దీంతో చిన్నగా మొదలైన గొడవ క్రమంగా పెద్దదిగా మారింది. చివరికి ఇరు వర్గాలు రాళ్లు, సీసాలతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

Guntur District
YSRCP
Telugudesam
Machavaram
flexi
Andhra Pradesh
  • Loading...

More Telugu News