bjp: దేశంలో క్రిమినల్ గ్యాంగ్ అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తోంది: సీపీఐ నేత నారాయణ ఆరోపణలు

  • సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ అప్పుడు అమిత్ షా మంత్రి 
  • ఆయన్ని రక్షించడానికి అధికారులను చంపేశారు
  • సీబీఐ దర్యాప్తు మోదీ కనుసన్నల్లో నడుస్తోంది 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్రిమినల్ గ్యాంగ్ అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తోందని ఆరోపించారు. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఈ ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో నాడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షాను రక్షించడం కోసం 12 మంది అధికారులను చంపేశారని ఆరోపించారు. ఈ కేసును మూసేసిన సీబీఐ జడ్జి కళ్లకు గంతలు కట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేసిన నారాయణ, సీబీఐ దర్యాప్తు నడుస్తోంది ప్రధాని మోదీ కనుసన్నల్లోనే అని ఆరోపించారు.

bjp
Amit Shah
cpi
narayana
modi
Gujarath
  • Loading...

More Telugu News