paruchuri: కొన్ని సంఘటనలను ఎప్పటికీ మరిచిపోలేం: పరుచూరి గోపాలకృష్ణ

  • చిరంజీవి ఫాన్స్ పూలు చల్లారు 
  • కృష్ణ అభిమానులు చప్పట్లు కొట్టారు 
  • ఆ హీరోలు ఫ్రీగా సినిమా చేస్తామన్నారు

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "చెన్నై లోని విజయ శేష్ మహల్ లో 'అడవి దొంగ' ఫంక్షన్ జరుగుతుండగా నేను .. మా అన్నయ్య వస్తుంటే చిరంజీవి అభిమానులు మాపై పూలు చల్లారు. 'చూశారా నా అభిమానులకి మీరంటే ఎంత ఇష్టమో' అని చిరంజీవిగారు అన్నారు.

అలాగే 'ముద్దాయి' ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మేము అలా ఎంటర్ కాగానే కృష్ణగారి అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఇక విజయవాడలో 'నరసింహా నాయుడు' సినిమా వేడుక లక్షలమందిలో జరుగుతున్నప్పుడు, 'మేము ఏడుగురం అన్నదమ్ములం కాదు .. పరుచూరి బ్రదర్స్ తో కలిపి తొమ్మిది మందిమి' అని బాలకృష్ణగారు అన్నారు. ఆ సంఘటనలను ఎలా మరిచిపోగలం చెప్పండి?

'బొబ్బిలి బ్రహ్మన్న' దగ్గర నుంచి మా పట్ల కృష్ణంరాజు గారు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. శోభన్ బాబు .. మోహన్ బాబు ఫ్రీగా సినిమా చేసిపెడతామని అన్నారు. ఇలా హీరోలు .. వాళ్ల అభిమానులు మమ్మల్ని ఇంతగా అభిమానించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News