Andhra Pradesh: ఏపీ కోసం ఢిల్లీ పెద్దలపై చంద్రబాబు పోరాడుతున్నారు : టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల కోసం బాబు పోరాటం
  • కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి
  • మోదీ గద్దె దిగితేనే ఏపీకి న్యాయం జరుగుతుంది

ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల కోసం ఢిల్లీ పెద్దలపై సీఎం చంద్రబాబునాయుడు పోరాటం చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ధర్మపోరాట దీక్ష సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ప్రధాని మోదీ గద్దె దిగితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని అన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుందని, విశాఖ రైల్వే జోన్ పై నోరుమెదపడం లేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు.

Andhra Pradesh
Srikakulam District
Telugudesam
mp
rammohan naidu
  • Loading...

More Telugu News