TRS: టీఆర్ఎస్ ఆకర్ష్ చివరకు వికర్ష్ గా మిగులుతుంది: గండ్ర

  • ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు విశ్వాసం లేదు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆకర్షించే పనులను పక్కన పెట్టాలి
  • సీఎల్పీ లీడర్ పదవికి నేను అర్హుడినే

ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి విశ్వాసం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల విషయంలో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ చివరకు వికర్ష్ గా మిగులుతుందని చెప్పారు. పక్క పార్టీల ప్రజాప్రతినిధులను ఆకర్షించే పనులను పక్కనపెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. సీఎల్పీ లీడర్ పదవికి తాను కూడా అర్హుడనేనని... అవకాశం ఇస్తే, సమర్థవంతంగా పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని తాను భావించడం లేదని అన్నారు.

TRS
kct
gandra venkataramana reddy
congress
  • Loading...

More Telugu News