Badradri kothgudem district: పవర్‌ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలంటూ.. భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు

  • మణుగూరు మండలం తిర్లపురంలో హెచ్చరిక పోస్టర్లు
  • మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరులకు హెచ్చరికలు
  • స్థానికుల్లో కలకలానికి కారణమైన పోస్టర్లు

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తిర్లపురంలో మావోయిస్టుల పేరుతో హెచ్చరిక పోస్టర్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకోవాలని, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరుల అరాచకాలను అడ్డుకోవాలంటూ మావోయిస్టులు తమ పోస్టర్లలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ పలు జిల్లాల్లో పోస్టర్ల ప్రచారం చేసిన మావోయిస్టులు తాజాగా స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ పోస్టర్ల యుద్ధం చేస్తున్నారు. అయితే ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Badradri kothgudem district
Maanuguru mandal
maoists posters
  • Loading...

More Telugu News